ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ

పటాన్ చెరులో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 
బచ్చుగూడెంలో శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం 
పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 7: పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన దేవాలయాల జీర్నోద్ధారణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్ కాలనీలో నూతనంగా పునర్నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాలతో పాటు ధ్వజస్తంభం, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో నూతన దేవాలయాల నిర్మాణాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం పటాన్ చెరు మండలం
బచ్చు గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సుమతి రామచందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆలయ కమిటీల ప్రతినిధులు,  కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *