కందుకూరు ,ప్రజాతంత్ర,అక్టోబర్ 19: బిఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అని కందుకూరు మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని కటికపల్లి, గూడూరు తదితర గ్రామాల్లో ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్య గ్యారెంటీ పతకాలను నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీ పథకాలను తెలంగాణ ప్రభుత్వం కాపీ కొట్టి ప్రచారం నిర్వహిస్తుందని ఆయన ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సివస్తుందని ఆయన తెలియజేశారు.కల్లబోల్లి మాటలతో ప్రజలను కెసిఆర్ నయవంచనకు గురి చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి పేద విద్యార్థులకు కనీస సౌకర్య లేక ఇబ్బందులు పడుతుంటే విద్యా శాఖకు న్యాయం చేకూర్చలేని మంత్రి ఎందుకని ఆయన నిలదీశారు.ఈ కార్యక్రమంలో గంగుల ప్రభాకర్ రెడ్డి,సురేందర్ యాదవ్, ఆయా గ్రామాల కమిటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరు నూరైనా మహేశ్వరంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే




