కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీ లతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొలన్ హన్మంత్ రెడ్డిని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 130 డివిజన్ వెంకటేశ్వర నగర్ వద్ద పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో రోడ్ షోను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఇంద్రసింగ్ నగర్, వాణి నగర్, మహేంద్ర నగర్, సుదర్శన్ రెడ్డి నగర్, కేఎంజీ కాలనీ, ప్రతాప్ ఎస్టేట్స్ మాణిక్య నగర్ మీదుగా మార్గ మద్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతూ ద్వారకా నగర్, డి నగర్, గణేష్ నగర్, కల్పన సొసైటీ మీదగా చెరుకుపల్లి కాలనీ నుండి అంబేద్కర్ నగర్ చౌరస్తా, శ్రీనివాస నగర్ మార్కెట్ రోడ్ గుండా సంజీవయ్య నగర్ మీదుగా బాలిరెడ్డి నగర్ చౌరస్తా నుండి పద్మ నగర్ దగ్గర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి ప్రజలకు వివరించాలని, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమస్యలు అన్నిటిని తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ మీదుగా పాపయ్య యాదవ్ నగర్, రాంరెడ్డి నగర్ తర్వాత సూర్య నగర్ వద్ద రోడ్ షో ముగిసింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కేపీ విశాల్ గౌడ్, ఐఎన్టియుసి నాయకులు చింతల నాగరాజు, ఆనంద్ రావు, 131 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బింగి లక్ష్మి నారాయణ, 131 డివిజన్ అధ్యక్షులు, మాజీ వార్డు సభ్యులు జాకీర్, డివిజన్ సీనియర్ నాయకులు జెస్సీ పాల్, మైనార్టీ నాయకులు నబీల్ త, హఫీజ్ భాయ్, ఖయ్యుమ్, అజీజ్, అన్వర్, భాస్కర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ఈశ్వర్, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు రంగమ్మ, సుజాత, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, ఐఎన్టియుసి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలపరచండి కొలన్ హన్మంత్ రెడ్డి





