ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ
మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం
ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్‌ ముందున్న ఇనుప కంచెను తొలగించడం ద్వారా ప్రజలకు స్వేచ్ఛ కలిగించామని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం ఇదని అన్నారు.టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెల్లడిరచారు. పెద్దఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులు చేపడతామని.. ఆ నది మరోసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారుతుందని చెప్పారు. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో ఉన్నామని అన్నారు.  గురువారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజీ నారాయణ కవితతో గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సామాన్య ప్రజల కోసం ప్రజాభవన్‌ను తెరిచామని చెప్పారు. ఆరు గ్యారంటీలల్లో  రెండిరటిని అమలు చేశామని.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ను ఇస్తామన్నారు. గత ప్రభత్వం రాష్టాన్న్రి అప్పుల మయం చేసి.. మాకు అప్పగించారని..ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని చెప్పారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామని.. తెలంగాణ రాష్టాన్న్రి పునర్‌ నిర్మాణం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హావిూల అమలుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.  కాలానుగుణంగా హావిూలను అమలు చేస్తామని.. ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో 1.8 కోట్ల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్‌ కంచెను తొలగించారన్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ ఏర్పాటైందని గుర్తు చేశారు. ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ప్రజాభవన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందని, తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని గవర్నర్‌ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 15 కోట్ల మంది మహిళలు ప్రయాణించారన్నారు. పాలమూరు రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, టిఎస్‌పిఎస్‌సి ద్వారా రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

 

రేవంత్‌ ప్రభుత్వం కొత్త ఎంఎస్‌ఎంఇ విధానం ప్రకటించిందని, దావోస్‌
సమావేశంలో రూ.40 వేల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని వెల్లడిరచారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్‌ సింగ్‌ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ అగ్రనేత, యుపిఎ వైఎస్‌ చైర్మన్‌ సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోందన్నారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించామని తమిళి సై  వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు. అర్హులైన వారికి రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేయనున్నట్లు తెలిపారు. కచ్చితంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందని… దాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు. యువతకు 2 లక్షల ఉద్యోగుల కల్పనపై దృష్టిపెట్టామన్నారు. ప్రజావాణిలో 1.8కోట్ల దరఖాస్తులు వచ్చాయన్నారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హావిూలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులరంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామన్నారు. గత సమావేశాల్లో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్‌ అందిస్తామని గవర్నర్‌ తమిళిసై వెల్లడిరచారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం, మౌలిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త  విధానాన్ని కూడా అమలులోకి తీసుకొస్తామన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుంది.

గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశాం. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తాం. విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేధ (ఏఐ) ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాం. క్రీడారంగంలో రాష్టాన్ని అగ్రగామిగా చేయడమే మా లక్ష్యం. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్జడెట్‌ కేవలం ఆర్థిక పత్రం కాదు.. భవిష్యత్‌కు నమూనా అని చెప్పారు.గవర్నర్‌ ప్రసంగం అనంతరం శాసన సభ, శాసన మండలి సమావేశాలు నేటికి వాయిదా పడ్డాయి. అంతకుముందు గవర్నర్‌ తమిళసై అసెంబ్లీకి రాగానే సిఎం రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ బాబులు వెళ్ళి స్వాగతం పలికి తోడ్కొని వచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *