ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు కాంగ్రెస్ భరోసా ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో గుంటి జంగయ్య కాలనీలో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు నర్సింహా యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ సమక్షంలో టిడిపి నుండి పలువురు సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ వారికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బీ ఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేస్తే బీజేపీ కి వెళుతుందని.. ఈ రెండు పార్టీలు లోపయ కారి ఒప్పందంతో.. ప్రజలను నయవంచనకు గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర సేవాదల్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్, గుంటి జంగయ్య కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు మక్సుద్, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, పలు డివిజన్ ల అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి డివిజన్ స్థాయి సీనియర్ నాయకులు, మహిళా నాయకులు పలు కాలనీల వాసులు, పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ భరోసా మధు యాష్కీ గౌడ్




