ఆమనగల్లు ఎస్సై ను సన్మానించిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 :  ఆమనగల్లు పోలీస్ స్టేషన్ కు ఇటీవల బదిలీపై వచ్చిన ఎస్సై బలరాం నాయక్ ను బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కండే సాయి ఆధ్వర్యంలో స్థానిక బీజేవైఎం నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి, అధికార ప్రతినిధి ఒగ్గు ప్రభాకర్, బీజేవైఎం మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కార్యదర్శులు, మహేష్, గిరి, బాలు,  నాయకులు శ్రీను, యాదగిరి, బూత్ అధ్యక్షులు శ్రీకాంత్, నిరంజన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *