ఆధునిక భారతదేశానికి రూపశిల్పి మీనన్‌

ఆయన పేరు మీద ఒక్క జీవిత చరిత్ర లేదు. పాఠశాలల సిలబస్‌లో ఆయన రచనల ప్రస్తావన లేదు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లకు వారి రాజ్యాంగ సలహాదారుగా సేవలందించిన ప్రతిభా శాలి, సమర్థ అధికారి ఆయన. స్వతంత్ర భారత దేశంలో, అధికార బదిలీల కీలక పాత్ర ధారిగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల శాఖ కార్యదర్శిగా, తరువాత ఒడిశా గవర్నర్‌గా పని చేశాడు. దేశం లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఆయన అసమాన ప్రతిభతో అత్యున్నత స్థాయి భారతీయ అధికారిగా ఎదిగాడు. ఆయనే ఆధునిక భారతదేశానికి రూపశిల్పి  వి. పి. మీనన్.వప్పల పంగుణ్ణి మీనన్ (1893 సెప్టెంబరు 30 – 1965 డిసెంబరు 31) భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి. ఆయన భారత దేశపు చిట్ట చివరి లిన్లిత్‌గో, వేవెల్,  మౌంట్ బాటన్ అనే చివరి ముగ్గురు వైస్రాయ్‌లకు రాజ్యాంగ సలహాదారు అయ్యాడు. రాజ్యాంగ సలహాదారుగా, రాజకీయ సంస్కర ణల కమిషనర్ గానూ పని చేశాడు. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి బ్రిటీష్ ఇండియాకు స్వతంత్రం రావడంలో అత్యంత కీలకమైన అధికార బదిలీలోని భారత విభజన, భారత స్వాతంత్ర్య చట్టం, భారతదేశ ఏకీకరణ, భారత రాజ్యాంగ రచన వంటి అంశాల్లో బ్రిటీష్ ప్రభు త్వానికి, కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వానికి సహకరిస్తూ కీలక బాధ్యతలు నిర్వర్తించాడు.
బ్రిటీష్, భారతీయ అధికారులచే విశ్వసించ బడిన మీనన్ ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చాడు. ఒట్టప్పలంలోని పనమన్న వద్ద 1893 సెప్టెంబరు 30న జన్మించాడు. 13 సంవత్స రాల వయస్సులో, నిర్మాణ కార్మికుడిగా, బొగ్గు గని కార్మికు డిగా, ఫ్యాక్టరీలో వరుసగా పని చేయడానికి పాఠశాలను విడిచి పెట్టాడు. 8వ తరగతి వరకు మాత్రమే చదివిన మీనన్, రెండు వేళ్లతో టైప్ చేయడం నేర్చిన తరువాత, 1929లో సిమ్లాలో భారత పరిపాలనలో హోం శాఖలో గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు.1947 నాటికి, మీనన్ వైస్రాయ్ సిబ్బందిలో అత్యంత సీనియర్ పోస్టుకు ఎదిగాడు, మౌంట్ బాటన్ విశ్వాసాన్ని,  ప్రేమను పొందాడు.స్వాతంత్ర్యానికి ముందు భారత గవర్నర్ జనరల్‌కు రాజ్యాంగ సలహాదారుగా మారారు. అంతకు ముందు, బ్రిటిష్ వలస రాజ్యాల సంస్కరణ కార్యాలయంలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహిం చాడు. 1942-47 మధ్య సంస్కర ణల కమిషనర్‌గా పనిచేశాడు. 1946లో బ్రిటిష్ వైస్రాయ్‌కు రాజ కీయ సంస్కరణల కమిషనర్‌గా నియమితు డయ్యాడు.1947-51 సంవత్స రాలలో రాష్ట్ర మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమించ బడ్డాడు.  మౌంట్ బాటన్ ప్రణాళి కకు ప్రత్యామ్నాయంగా దేశ విభజ నకు సంబంధించి ఆయన రూపొం దించిన ముసాయిదా, ముఖ్యంగా ముగ్గురు ప్రముఖులు…నెహ్రూ, పటేల్,  మౌంట్ బాటన్ల ఏకకాల ఆమోదం పొందింది. భారత బ్రిటిష్ ప్రభుత్వానికి రాజ్యాంగ సలహా దారుగా, స్వాతంత్ర్యం అనంతరం, అధికార మార్పిడి, రాష్ట్రం యొక్క రాజ్యాంగ విషయాలు, ప్రధానంగా సార్వ భౌమాధికారం, పాలన, ఫెడరల్ యూనియన్, యూనిట్ల మధ్య అధికార పంపిణీకి సంబంధించిన విధానాలపై మీనన్ చేసిన కృషి అనన్య సామాన్యం.
భారత దేశానికి స్వాతంత్ర్యానికి దారితీసిన ప్రసిద్ధ ప్రణాళికను సిద్ధం చేసింది మీనన్. తన పుస్తకం ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా’లో, ప్రత్యామ్నాయ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేయడానికి  తనకు రెండు లేదా మూడు గంటలు మాత్రమే సమయం ఎలా పట్టిందో గ్రంథస్థం చేశాడు. ఆయన ప్రణాళికను పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ,  మహమ్మద్ అలీ జిన్నా అంగీక రించారు.
మీనన్ సర్దార్ పటేల్‌తో కలిసి 500 కంటే ఎక్కువ రాచరిక రాష్ట్రాలను యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడంపై పనిచేశాడు. ఈ విషయంలో వాస్తవంగా పటేల్ కన్నా మీనన్ చేసిన కృషియే ఎక్కువ. మంత్రిత్వ శాఖ మరియు వివిధ భారతీయ రాచరిక పాలనల మధ్య మంచి సంబంధాన్ని పెంపొందించ డానికి దౌత్యాన్ని ఉపయోగించాడు. పటేల్ రాయబారిగా వ్యవహరించాడు. భావి భారత స్వతంత్ర దేశానికి ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించడానికి అయిష్టంగా ఉన్న రాజులు, పాలకులతో ఒప్పందాలు కుదుర్చు కున్నాడు. మీనన్ తన రచనలైన రెండు సంపుటాలలో స్వతంత్ర్య  భారతదేశం, పాకిస్తాన్ రెండు సార్వభౌమ రాజ్యాల ఆవిర్భావానికి దారితీసిన సంఘటనల చారిత్రక నేపథ్యం వివరించారు.  500 పైగా రాచరిక రాష్ట్రాలను స్వతంత్ర భారత దేశంలో విలీనం చేయ డంలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ కు సహాయం చేసిన ఘనత వహించిన మీనన్ కు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. ఆయన పేరు మీద ఒక్క జీవిత చరిత్ర  లేదు. పాఠశాల సిలబస్‌లో ఆయన రచనల ప్రస్తావన లేదు. ఆయన స్థాపించిన విపి మీనన్ అవార్డు మాత్రమే గుర్తుగా ఉంది. బ్రిటీష్ మరియు స్వతంత్ర భారత దేశ సమర్థ అధికారి, డిసెంబర్ 31, 1965న 72 సంవత్సరాల వయస్సులో బెంగళూరులోని కంటోన్మెంట్‌లోని కుక్ టౌన్‌లో మరణించాడు.
 రామ కిష్టయ్య సంగన భట్ల…
    9449595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *