ఆదివాసీ ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : ఆదివాసీ, ఎరుకల పక్షపాతి సిఎం కెసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కుర్ర సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల అభివృద్ధి కొరకు తెలంగాణ ఎరుకల జాతి చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీం ప్రవేశపెట్టి రూ.60 కోట్లు నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎరుకల జాతిని గుర్తించి ప్రతిష్టాత్మకంగా కొత్తగా ఎరుకల సాధికారత పథకం ప్రారంభించి 60 కోట్లు నిధులు మంజూరు చేసిన సిఎం కెసిఆర్ తెలంగాణ ఎరుకల సంఘం(కుర్రు) రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కుతాడి రాములు, లోకిని రాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సంగారెడ్డి మాజీ మాజీ కుర్ర సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గానీ తెలుగుదేశం ప్రభుత్వం గానీ తెలంగాణ ఎరుకల జాతిని గుర్తించ లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాతనే కేసీఆర్ గుర్తించి నిజాంపేట్ లో ఎకరం భూమి కేటాయించి భవన నిర్మాణం కొరకు రూ.5 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎరుకల జాతి ఆరాధ్య దైవమైన ఎరుకల నాంచారమ్మ జాతరను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం రూ.5 లక్షల బడ్జెట్ ఇచ్చి మా ఆత్మగౌరాన్ని కాపాడినరని కొనియాడారు. ఎరుకల జాతిని గుర్తించి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీంను ప్రవేశపెట్టినందుకు సిఎం కెసిఆర్, సహకరించిన మంత్రులు తన్నీరు హరీష్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, ట్రైబల్ కార్యదర్శి క్రిస్టియనా, ట్రైకార్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరము లోకిని రాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా వున్న పందుల పెంపకాల సహకార సంఘం(సొసైటీ)లకు 2-5 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కుర్ర సత్యనారాయణకు ఇచ్చిన ఎమ్మెల్సీ స్థానాన్ని గవర్నర్ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి కూతాడి రవికుమార్, ఉపాధ్యక్షులు ఎం.గోపాల్ శ్రీరామ ఆనంద్, కెంసారపు నాగులు, రస్తాపురం సత్యనారాయణ, కోనేటి రాజు, కేతిరి రాజశేఖర్, అంగిడి నారాయణ, కెంసారపు మల్లేషం, కెంసారపు యాదగిరి, బి.సత్యనారాయణ, వెలుగు శంకర్, బిజిలి ఎల్లేష్, పల్లకొండ ప్రభాకర్, కుతాడి శ్రీనివాస్, మానుపాటి రమేష్, కుతడి కుమార్ స్వామి, మానుపాటి రాజు, కురాకుల రాజు, రాష్ట్ర మహాళ అధ్యక్షరాలు కారుకుల శ్యామల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *