తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని జీవన్గి గ్రామానికి చెందిన యువకులు మోహన్ అన్నారు. బుధవారం బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దిశ రిపోర్టర్ మోహన్,మధు, పరశురాం, పవన్, నరేష్ ల తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ. .సమాజంలోని నిమ్నజాతి వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేసే దిశగా వైపు అంబేడ్కర్ రాజ్యాంగ రచన చేసినట్లు వివరించారు. ఆంబేడ్కర్ కృషి వల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి నాయక త్వంలో తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తోందన్నారు. అట్టడుగు వర్గంలో జన్మించి ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఉన్నత చదువులు చదివిన గొప్ప వ్యక్తి ఆంబేద్కర్ అని అన్నారు.
ఆదర్శనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిన్గిలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు




