పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ప్రజలంతా ఆదరించి తమ అమూల్యమైన ఆశీర్వాదాలు అందించాలని నీలం మధు సతీమణి నీలం కవిత ముదిరాజ్ కోరారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా గుమ్మడిదల మండలం బొంతపల్లి,వీరన్నగూడెం, కట్టెంకగూడెం గ్రామాల్లో బీఎస్పీ పార్టీ తరపున ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రజలే మా కుటుంబంగా ప్రజల కష్టాలు తీర్చడమే ఎజెండాగా నీలం మధు ముదిరాజ్ పనిచేస్తున్నాడని తెలిపారు.పదవి లేకపోయినా కష్టం అని తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటూ సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలందరూ అభివృద్ధిలో ఉండాలని నిత్యం పరితపిస్తూ, అన్ని వర్గాల ప్రజల బాధలను తీర్చడానికి మీ ముందుకు వస్తున్న మీ ఇంటి బిడ్డ నీలం మధు ముదిరాజ్ కు ప్రజలంతా అండగా నిలబడాలని కోరారు. మీ ఇంటి బిడ్డను ఒక సారి ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపిస్తే మనతో పాటు మన బహుజన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. బిఎస్పి పార్టీని గెలిపించి అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పటాన్ చెరు అభివృద్ధి కోసం నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీని బలపరిచి ఏనుగు గుర్తుపై ఓటు వేసి మీ ఇంటి బిడ్డ నీలం మధు ముదిరాజ్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆదరించండి..ఆశీర్వదించండి




