ఆడబిడ్డలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్‌ ‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహించిన సందర్భంగా మహిళలలకు మంత్రి కేటీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా.. ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా.. కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మనసారా ఆశీర్వదిస్తున్న యావత్‌ ‌మహిళా లోకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్‌ ‌చేశారు. కల్యాణలక్ష్మి కేవలం పథకం కాదు.. ఒక విప్లవం అని తెలిపారు.
ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్‌ ‌వేసిందని.. మరోవైపు బాల్యవివాహాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టిందని.. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా అని పేర్కొన్నారు. పదిలక్షలకుపైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్‌ ‌భగీరథతో శాశ్వతంగా తీర్చిన విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి.. కేసీఆర్‌ అని అన్నారు. మన అంగన్‌వాడీలను, ఆశా కార్యకర్తలను వెవట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి.. దేశంలోనే అత్యధిక పారితోషికాలు ఇచ్చి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదని.. మహిళా సాధికారతలో తెలంగాణకు తిరుగులేదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *