కాంతల క్రికెట్‌లో కాంతి పుంజం

మహిళా క్రికెట్‌కే మణిహారం

అతివల క్రికెట్‌ను అందలమెక్కించి..

ఆటలో మెరిసి, ఆటను మెరిపించె

మిరాకిల్‌ ‌లేడీ మన మిథాలీ రాజ్‌ !

 

ఒడుదుడుకుల్ని ఓర్పుగా సహించి..

క్రికెట్‌ ఆటను అందలమెక్కించి..

ఎన్నో మైలురాళ్లు ధీటుగా దాటుతూ..

ఫార్మాట్‌ ఏదైన రికార్డుల మోతలతో..

అధిరోహించె అసమాన్య కీర్తి శిఖరాలు !

 

 

ఆమె మహిళా క్రికెట్‌కే పర్యాయపదం

అలుపెరుగని ఆట తీరు సమ్మోహనం

ఆమె మెరుపుల బ్యాటింగ్‌ ‌రాజసం

విజయతీరాల్ని తాకిన నాయకత్వం

బ్యాట్‌ ‌పడితే రికార్డుల విడ్డూరమే !

 

తన బ్యాట్‌కు ఉన్నాయి నేత్రాలు

బంతిని చూసి బౌండరీలు దాటిస్తూ..

మైదానాన అర్జున ఆవార్డీ మెరుపులు

క్రీజ్‌కు, బ్యాట్‌కు శాశ్విత వీడ్కోలంటూ..

ఇన్నింగ్స్ ‌ముగించెను క్రికెట్‌ ‌దిగ్గజం !

 

పద్మశ్రీ లేడి టెండూల్కర్‌ ఆటకు సలాం

సెంచరీల మోత మోగించిన ఖేల్‌రత్న

పరుగుల రాణి ఆటకు చెప్పెను టాటా..

మిథాలీ బ్యాట్‌కు అల్విదా అన్న వేళ

శభాష్‌ ‌రాజ్‌ అం‌టోంది క్రికెట్‌ ‌రాజ్యం !

– మధుపాళీ

కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *