ఒకప్పుడు ఆకాశం అంతా
అంధకారంగా ఉండేది.
ఆకాశం భయపడలేదు?
నిస్సత్తువని చేరతీయలేదు?
సహనాన్ని, సమయాన్ని నమ్ముకుంది!
వేకువ వచ్చే వరకు వేచి చూసింది.
చివరగా విజయాన్ని చవిచూసింది!
ఆవహించే అంధకారానికి
సమాయత్తం అయ్యింది!
నక్షిత్రాలని పొదుగుకుంది.
మెరుపురవ్వల్ని దాచుకుంది!
ఉల్కాపాతాన్ని రగుల్చుకుంది!
దివాకరుడిని లాలిస్తూనే,
రజనీకరుడిని కవ్వించింది!
ఇప్పుడు చీకటంటే ఆకాశానికి
ఓ కోలాహలం! ఓ సందడి సంబరం!
సందేవేళ చీకటితో సరససల్లాపం
వెన్నెల్లో విహరిస్తూనే సమాగమం!
ప్రభాతం దాకా సహజీవనం!
చీకటి విలంబనమైతే
విరహన్ని అహ్వానిస్తోంది!
వేకువ అవలంబనమైతే
వెలుగును ఆహ్లాదిస్తోంది!
ఇప్పుడు చెప్పు మిత్రమా!
కష్టాన్ని ఇష్టం చేసుకున్న
ఆకాశం కథ మనకు
స్ఫూర్తి దాయకం కదూ?
– ఉషారం
9553875577




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల