ఆం‌ధ్రా ప్రాంతంలో సొంతూళ్లకు చేరుకుంటున్న ప్రజలు

విజయవాడ, జనవరి 11 : పండగద మమకారంతో పలువురు ఉద్యోగులు ఆంధ్రాప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల్లో వొచ్చి చేరారు. బస్సులు ,రైళ్లలో దిగుతున్న వారే గాకుండా సొంత వాహనాలు ఉన్న వారితో దిగుతున్న వారితో ఆంధ్రా జిల్లాల్లో సందడి కనిపిస్తోంది. గత రెండేళ్లుగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువశాతం మంది వర్క్‌ఫ్రమ్‌హోం పేరుతో ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే 25శాతం మంది ఆఫీసులకు వెళ్తున్నారు. వీరితోపాటు బ్యాంకు ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు ఇతర రాష్టాల్ల్రో ఉంటున్నారు. ప్రస్తుతం వీరు సొంతూళ్లకు చేరుకుంటున్నారు.

ఐటీ ఉద్యోగులకు జనవరి 14,15 రెండు రోజులు సెలవులు పోయాయి. శని,ఆదివారాలు పండగలు రావడంతో ప్రతి ఒక్కతరూ తమ సెలవుఉల పోయాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులు సొంతూరిలో గడపవచ్చు అనుకున్న వారు సోమవారం సెలవు తీసుకుంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక,తెలంగాణా రాష్టాల్ర నుంచే పండుగ వేళల్లో జిల్లాలకు వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ సారి ఓ రకంగా సెలవులు కలసి రాలేదన్న బాధ అందరిలోనూ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *