ఆ ‌కార్లు ఎవరివి..?

అమ్నేషియా పబ్‌ ‌కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు
వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు
వివరాలు కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ఎం‌దుకు దాస్తున్నారు
డియాతో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు

న్యూ దిల్లీ ,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌ ‌కేసు తెలంగాణలో పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సంచలన

వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహీల్స్ ‌మైనర్‌ ‌బాలిక అత్యాచారం కేసులో పూర్తిగా నిజాలు చెప్తూనే కొన్ని ఆధారాలను హైదరాబాద్‌ ‌సీపీ అనంద్‌ ‌కప్పిపుచ్చుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. బాలిక రేప్‌నకు వినియోగించిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమని లోకమంతా కోడై కూస్తున్నా ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. మైనర్లు కారును నడిపినప్పుడు తక్షణమే యాజమానులకి ఎందుకు నోటిసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్‌ ‌రెడ్డి బుధవారం ఢిల్లీలో డియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ‌లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలన్నారు. ఆరోపణలు ఎదర్కొంటున్న వారిని విచారించాలని, కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారని అన్నారు. బెంజ్‌ ‌కారు యజమాని ఎవరో చెప్పలేదు. ఇన్నోవా కారు ఎవరిదో కూడా సీవీ ఆనంద్‌ ‌చెప్పలేదు. ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్లు తొలగించింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పటి వరకు వాహనాల యజమానులకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. నిందితులు ఆధారాలు లేకుండా చేసిన ప్రయత్నాలను ఎందుకు చెప్పలేదు. పాత్రధారులు, సూత్రదారులు ఎవరన్నది సీవీ ఆనంద్‌ ‌చెప్పడం లేదని విమర్శించారు..ఆ కార్ల ఓనర్లను మోటార్‌ ‌యాక్ట్ ‌చట్టం 133 ప్రకారం.. పోలీస్‌ ‌స్టేషన్‌కి పిలిపించి విచారించాలని అన్నారు. ఆ కారు ఓనర్ల పేర్లను ఎందుకు దాస్తున్నారో సీపీ ఆనంద్‌ ‌చెప్పాలని అన్నారు. సెక్షన్‌ 13 ‌ఫోక్సో చట్టం ప్రకారం ఆ కార్ల ఓనర్లపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అత్యాచారం జరిగిన రెండు రోజుల వరకు ఇన్నోవా కారు ఎక్కడ పోయిందని రేవంత్‌ ‌ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన కారుని అసాంఘిక కార్యక్రమాలకు ఎలా వినియోగిస్తున్నారని రేవంత్‌ ‌ప్రశ్నించారు. కారులో ఉన్న అన్ని ఆధారాలను తొలగించిన తర్వాతే .. పోలీసులకు దొరికిందని రేవంత్‌ ఆరోపించారు. ఈ కేసులో అత్యంత కీలకమైన నాయకుల పిల్లలపైన ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. విశ్వనగరంగా కావలసిన హైదరాబాద్‌ని కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌విషపు నగరంగా మార్చారని రేవంత్‌ ‌విమర్శించారు. గత వారం రోజుల్లో మైనర్‌ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయని, దీనికి కారణం పబ్బులు, డ్రగ్స్,‌గంజాయి అని అన్నారు. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక హైదరాబాద్‌ ‌లో 150 పబ్బులకి అనుమతి ఇచ్చారని, లిక్కర్‌ ‌యజమానులు మొత్తం కల్వకుంట్ల కేసీఆర్‌ ‌చుట్టాలేనని రేవంత్‌ అన్నారు. అంతార్జతీయ విమనాశ్రయం పేరు చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్‌ ‌హౌస్‌ ‌నడుపుతుందని రేవంత్‌ ‌విమర్శలు గుప్పించారు. మైనర్‌ను లైంగిక దాడి చేసిన వాహనాల ఓనర్లను పిలిచి ఎందుకు విచారించలేదు. ఇన్నోవా కారులో బాలికను తీసుకెళ్లారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని చెబుతున్నారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిదే బాధ్యత కాదా అని అన్నారు. కార్ల యజమానులపై ఎందుకు కేసు పెట్టలేదని, వాహన యజమానులను ఎందుకు దాస్తున్నారని రేవంత్‌ ‌సూటిగా ప్రశ్నించారు.

పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదు

నిందితుల అరెస్ట్ ‌చేసి విచారిస్తున్నారు

అనవసరంగా రాజకీయాలు చేయరాదు

జూబ్లీహిల్స్ ‌కేసుపై మంత్రి మహ్మూద్‌ అలీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌సంచ లనం రేపిన జూబ్లీల్స్ ‌మైనర్‌ ‌బాలక రేప్‌ ‌ఘటనకు సంబంధించి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. నిందితులు ఎవరైనా సరే తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని మరోసారి రుజువైందన్నారు. పోలీసులు ఈ కేసును నిష్పక్ష పాతంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. పోలీసులపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఈ కేసులో బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణ

పోలీసులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తారనేదానికి కేసులో ఆరుగురిని అరెస్ట్ ‌చేయడం అందుకు నిదర్సనమని అన్నారు. తమను బ్లేమ్‌ ‌చేసేందుకు కొన్ని రాజకీయంగా శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నంబర్‌ ‌వన్‌ ఇతర స్టేట్‌ ‌పోలీసులకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించండి పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా వహించాలి.టెక్నాలజీ స్మార్ట్ ‌ఫోన్‌ అం‌దుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో పరివర్తనలో మార్పు వచ్చిందన్నారు. పేరెంట్స్ ‌తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మైనర్‌ ‌బాలిక అత్యాచారం వ్యవహారంలో తన మనవడిపై అనవసర ఆరోపణలు చేశారని, అసలు నిందితులు అరెస్ట్ ‌కావడంతో తన మనవడిపై ఆరోపణలు తప్పని తేలిందని మహమూద్‌ అలీ అన్నారు. జూబ్లీ హిల్స్ ‌మైనర్‌ ‌బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ ‌చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిమహమూద్‌ అలీ మాట్లాడుతూ… వక్ఫ్ ‌బోర్డు చైర్మన్‌ ‌పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగినందున చైర్మన్‌ ‌తొలగింపు కూడా బోర్డు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు… రాజకీయా సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. సెల్‌ ‌ఫోన్ల వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రుల పిల్లల విషయంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఘటనకు సంబంధించి చట్టపరిధిలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.

 

ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్ ‌చైర్మన్‌దే

జూబ్లీహిల్స్ ‌బాలిక రేప్‌ ‌కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితులు వాడిన ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డ్ ‌చైర్మన్‌దిగా నిర్థారించారు. దినాజ్‌ ‌పేరిట ఇన్నోవా కారును వక్ఫ్‌బోర్డ్ ‌చైర్మన్‌ ‌కొన్నారు. ఏడాదిన్నరగా వక్ఫ్‌బోర్డ్ ‌చైర్మన్‌ ఇన్నోవా నడుపుతున్నారు. మే 28న ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డ్ ‌చైర్మన్‌ ‌కుమారుడు పబ్‌కు వెళ్లాడు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు.. ఒకవేళ విషయం బయటపడినా అంత తేలిగ్గా దొరక్కుండా ఉండేందుకు కుయుక్తులు పన్నారు. తమ సిమ్‌ ‌కార్డులను ఇద్దరు ఇతర వ్యక్తుల ఫోన్లలో వేసి వాళ్లను గోవా పంపారు.. వారు మాత్రం తెలివిగా వేరే సిమ్‌లతో కర్ణాటక వెళ్లారు. అత్యాచారానికి వాడిన ఇన్నోవా కారులోని ఆనవాళ్లు, ఆధారాలు చెరిపివేసేందుకు యత్నించారు. ప్రభుత్వ వాహనం అని ఉన్న స్టిక్కర్‌ను తొలగించేశారు. తాత్కాలిక రిజిస్టేష్రన్‌ ‌నంబరును కూడా

గుర్తుపట్టకుండా చేశారు. ఒక్కచోట ఉండకుండా వేర్వేరుచోట్లకు పరారయ్యారు. ఆఖరికి సోషల్‌ ‌డియా ఖాతాలను డిలీట్‌ ‌కొట్టి.. బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇలా.. క్రిమినల్‌ ‌బ్రెయిన్‌తో చేయాల్సినదంతా చేశారు. అయితే, బాలిక ధైర్యం కూడదీసుకుని నిజం చెప్పడంతో వారి దురాగతం దాగలేదు. అదే సమయంలో దొరక్కుండా తప్పించుకుందామనే వారి ప్రయత్నాలూ పారలేదు. ఇప్పుడు నిందితులందరూ కటకటాల వెనక్కు వెళ్లారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *