అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 15 : తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు వర్గమైన మాదిగల పక్షాన అనేక విషయాలలో నిలబడినందుకు ధర్మ సమాజ్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కమిటీ తీర్మానించినట్లు ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ అంజయ్య తెలిపారు. ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ లను సింహ భాగం మాదిగలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ మ్యానిఫెస్టోలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లతో కూడిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంతో పోరాడి సాధించాలనే నిర్ణయం తీసుకున్నందుకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ బీసీ నిరుపేదలకు భూదేవి పథకం భూ పంపిణీ, రైతు కూలీలకు, చిన్న, సన్నకారు, కౌలు రైతులకు నెల నెల రూ.5 వేల జీతాలు చేర్చడం హర్షణీయం అన్నారు. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మాదిగల ఓట్లను ధర్మ సమాజ్ పార్టీ ‘టార్చ్ లైట్’ గుర్తుకే ఓటు వేయాలని మాదిగ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ భీంరావ్, కో-కన్వీనర్ యూబి రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *