అసత్య ప్రచారం…!

  • తెలంగాణలో కాంగ్రెస్‌పై బిఆర్‌ఎస్‌ ‌బురద
  • మండిపడ్డ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌థాక్రే

న్యూ దిల్లీ, జూలై 12 : సీఎం కేసీఆర్‌ ‌సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణలో వి•డియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌ ‌వ్యవహారాల ఇంఛార్జ్ ‌మాణిక్‌ ‌రావు థాక్రే  మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్‌ ‌కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.  బుధవారం వి•డియాతో మాట్లాడుతూ..వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసన్నారు. కేసీఆర్‌ ‌పాలన అవినీతి, అక్రమాలతో మునిగిపోయిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌రై•తుల వ్యతిరేకి అని, ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకం అని ప్రచారం చేస్తుందని అన్నారు. వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ ‌గురించి రాహుల్‌ ‌గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కుర్చీ కింద భూమి కదులుతుంది కాబట్టి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ‌రెడ్డి వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలు వింటే ఆయన చెప్పిన ఆలోచన విధానం అర్థం అవుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ వేగంగా బలం పుంజుకుంటుందన్నారు.

కేసీఆర్‌ ‌పది సంవత్సరాల పాలనలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రయోజనం కలిగింది తప్ప సామాన్య ప్రజలకు ఏవి• జరగలేదని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ కేసీఆర్‌ ఎం‌దుకు చెయ్యలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హావి•ని ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామన్నారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌కర్నాటక, చత్తీస్‌ఘడ్‌లలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇచ్చిన హవి•లు అమలు చేస్తూ రైతులకు ఎక్కువ ప్రయోజనం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌బలోపేతం కావడాన్ని కేసీఆర్‌ ‌జీర్ణించుకోలేక పోతున్నారని వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ ‌రెడ్డి ఉచిత విద్యుత్‌ ‌గురించి చేసిన వాఖ్యలు ఏ సందర్భంలో చేసారో అర్ధం చేసుకోవాలని… కొన్ని రాజకీయ పార్టీలు రేవంత్‌ ‌రెడ్డి వాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని మాణిక్‌ ‌రావు థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *