అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 28:  కెసిఆర్ నియంతృత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం ఎస్ వి ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుమీద సాధించిన తెలంగాణలో నిరుద్యోగ యువతకు నిరాశ మిగిలిందని అన్నారు. 1200 మంది ఆత్మబలి దానాలతో పోరాడు తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు.అహంకారపూరితమైన ప్రభుత్వంపై తిరుగుబాటు జరుగుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమం మాదిరిగానే ఇప్పుడు కూడా కెసిఆర్ పై యుద్ధం జరుగుతుందని ప్రజలందరూ ఐక్యంగా నిలిచి కేసీఆర్ ను ఓడించాలని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నిరుపేదలకు లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ ప్రకటించిన హామీలకు ప్రబోభాలకు ప్రజలు ఆకర్షితులు కాకుండా మీ ఓటును ఆలోచించి సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి కానుకగా ఇవ్వాలని అన్నారు. తాండూర్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *