శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజాపా అభ్యర్థి రవి కుమార్ యాదవ్ అన్నారు. మేరకు ఆయన బుధవారం డివిజన్ సాయి నగర్ మాదాపూర్ డివిజన్ గోకుల్ ప్లాట్స్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలలో అవినీతి, భూకబ్జాలు తప్ప ఒరగ పెట్టింది ఏం లేదని కేసీఆర్ కుటుంబానికి మొత్తంగా ఉద్యోగాలు తప్ప నిరుద్యోగులకు మాత్రం ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఎద్దేవా చేశారు. అవినీతి పాలనను అంతమందించాలంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నవంబర్ 30 తారీకున జరిగే ఎన్నికలలో శేరిలింగంపల్లి నుండి పోటీ చేస్తున్న రవికుమార్ యాదవ్ ను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
అవినీతి కుటుంబ పాలనను అంతం చేద్దాం శేరిలింగంపల్లి భాజపా అభ్యర్థి రవికుమార్ యాదవ్



