అవనగల్లులో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం తెలంగాణ బిజెపి శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముట్టడిలో భాగంగా కల్వకుర్తికి తరలి వెళ్తున్న బిజెపి నాయకులను ఆమనగల్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రహించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఆమనగల్లు  మున్సిపాలిటీ బిజెపి చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య,  కౌన్సిలర్ లు, బిజెపి సీనియర్ నాయకులు గోరటి నరసింహ,  చెక్కల లక్ష్మణ్, శ్రీకాంత్ సింగ్, వెంకటయ్య, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *