పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరిస్తున్న దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి, బొంబాయి కాలనీలలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి అధికారం అప్పచెప్పారని, వాటి అమలులోను అదే చిత్తశుద్ధి చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య, సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, పరమేష్ యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు





