పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలం మధు ను ఘనంగా సత్కరించారు. ఎక్కడకు వెళ్లినా ప్రజలు తమ మనిషిగా ఘనంగా స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.ఇదే విధంగా ఆశ్వీరదిస్తే సేవ చేసే అవకాశం వస్తుందని దీనితో అందరి కష్టసుఖాల్లో పాలుపంచుకుoటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్కే సత్యనారాయణ,గారెల శ్రీశైలం, ఎకె ఫౌండేషన్ ఖదీర్, రవి చారి,బాల్ రాజ్, మహేందర్ రెడ్డి,రవిగౌడ్,శాంతమయ్య,కుమార్ , కిషోర్, పృథ్వి,రవికుమార్,శ్రీకాంత్, కృష్ణ,మూర్తి, జాతర నిర్వాహకులు, పెద్దలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.



