అమెరికాలో మంచు తుఫాన్‌ ‌బీభత్సం

  • క్రిస్మస్‌ ‌వేడుకలు తీవ్ర అంతరాయం
  • దేశవ్యాప్తంగా 31 మంది మరణించారని అంచనా

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 26 : ‌క్రిస్‌మస్‌ ‌పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ ‌పేలుడు సంభవించడటంతో 48 రాష్టాల్రు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూయర్క్ ఒక వార్‌ ‌జోన్‌ను తలపిస్తున్నది. గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. విపరీతమైన చల్లని గాలులు వీస్తుండటంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 31 మంది మృతిచెందారు. పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్‌ ‌స్తంభాలు నేలకూలాయి.

విద్యుత్‌ ‌సరఫరా నిలిచి పోవడంతో 20 లక్షల మందికి పైగా అంధకారంలో చిక్కుకున్నారు. న్యూయార్క్‌లో పరిస్థితి యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నదని గవర్నర్‌ ‌క్యాథీ హోచుల్‌ అన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాలు వెళ్లడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు. ఇక బఫెలో లోని కొన్ని ప్రాంతాలలో 2.4 అడుగుల మేర మంచు కురిసిందని, విద్యుత్‌ ‌లేకపోవడంతో ప్రజలు ప్రమాదంలో చిక్కుకుపోయారని అధికారులు వెల్లడించారు. తుఫాను పరిస్థితుల్లో ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు కోరారు. విద్యుదుత్పత్తి కేంద్రాల సామర్థ్యం పడిపోవడంతో, పలు నివాసాలకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయింది. సుమారు 60 శాతం మంది మంచు తుపానుతో విలవిల్లాడుతున్నారు.

సుమారు ఏడు లక్షల మంది కంటే ఎక్కువ మంది అమెరికన్లు క్రిస్మస్‌ ‌వేడుకల సమయంలోనూ విద్యుత్‌ ‌కోతలకు గురయ్యారని రాయిటర్స్ ‌నివేదిక తెలిపింది. భారీ శీతల గాలులు, హిమపాతం, కారు ప్రమాదాల కారణంగా సుమారు 18 మంది మరణించినట్లు పేర్కొంది. మంచు తుపాను, క్రిస్మస్‌ ‌సెలవుల కారణంగా అనేకమంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని తెలిపింది. శనివారం 2,700 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయని, 6,400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొంది.  న్యూఇంగ్లాండ్‌ ‌ప్రాంతంలో అత్యధికంగా విద్యుత్‌ ‌సరఫరాకి అంతరాయం ఏర్పడిందని, 2,81,651 మంది ప్రభావితమయ్యారని సిఎన్‌ఎన్‌ ‌పేర్కొంది. ఆదివారం నాటికి పశ్చిమ న్యూయార్క్‌లో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగామని రాష్ట్ర గవర్నర్‌ ‌కాథీ హోచుల్‌ ‌తెలిపారు. మంచు తుపాను ఇంకా ముగియలేదని ఆయన ట్వీట్‌ ‌చేశారు. ప్రజలు నివాసాల్లోనే ఉండాలని, ప్రయాణాలు చేయవద్దని సూచించారు. న్యూయార్క్‌లోని బఫా ప్రాంతంలో గంటకు 96 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని డియా తెలిపింది. విజిబిలిటీ సున్నాకి దగ్గరగా ఉందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *