అమెరికాలో బోర్లాగ్‌ ‌సదస్సుకు.. మంత్రులు కెటిఆర్‌, ‌నిరంజన్‌ ‌రెడ్డిలకు ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్‌కు, మంత్రి నిరంజన్‌ ‌రెడ్డికి ఆహానాలు అందాయి. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ’బోర్లాగ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌డైలాగ్‌’ ‌సదస్సులో వీరు పాల్గొననున్నారు. ఈ వేదికపై తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని సదస్సు నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. అక్టోబర్‌ 24 ‌నుంచి 26 వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఉన్న డెస్మోయిన్‌లో ఈ సదస్సు జరుగనున్నది. దీనికి ప్రపంచం నలుమూలల నుంచి 1200 మంది వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. వర్చువల్‌ ‌గా మరికొంతమంది పాల్గొంటారు. ఇక ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఏటా ఈ సదస్సును వరల్డ్ ‌ఫుడ్‌ ‌ప్రైజ్‌ ‌ఫౌండేషన్‌ ‌సంస్థ నిర్వహిస్తుంది.

ఈ సమావేశాల్లో వ్యవసాయ నిపుణులతోపాటు విధాన నిర్ణేతలు, పలు రంగాల శాస్త్రవేత్తలు, ఔత్సాహికులు కూడా పాల్గొంటారు. ఈ ఏడాది హార్నెసింగ్‌ ‌ఛేంజ్‌ ‌థీమ్‌తో సదస్సును నిర్వహిస్తున్నట్టు బ్రాన్‌స్టాండ్‌ ‌తన లేఖలో తెలిపారు. నార్మన్‌ ఈ ‌బోర్లాగ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌డైలాగ్‌ను బోర్లాగ్‌ ‌డైలాగ్‌ అని కూడా పిలుస్తారు. 65 కంటే ఎక్కువ దేశాల నుంచి గ్లోబల్‌ ‌లీడర్లు, నిపుణులు, అధ్యాపకులు ఇందులో పాల్గొని స్థిరమైన, సమానమైన, పోషకాహార వ్యవస్థను సాధించడానికి అవసరమైన మార్గాలపై చర్చిస్తారు.

ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్‌ ఈ ‌బోర్లాగ్‌ ‌పేరిట ఏర్పాటుచేసిన బోర్లాగ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌డైలాగ్‌ ‌సమావేశంలో ఈసారి ఆహార నాణ్యత, పరిమాణాన్ని పెంచడంతోపాటు అందరికీ ఆహార లభ్యత అనే అంశాలపై చర్చించనున్నారు. ’వి• ప్రసంగం బోర్లాగ్‌ ‌డైలాగ్‌ ‌సదస్సుకు సాటిలేని విలువను జోడిస్తుంది. ప్రపంచ ఆహార అభద్రతను తగ్గించడం, ఆహార వ్యవస్థను మెరుగుపర్చడం కోసం కృషిచేస్తున్నవారు హాజరయ్యే ఈ సదస్సులో వి•రు పాల్గొనడం సదస్సుకు మరింత గౌరవం తెస్తుందని వరల్డ్ ‌ఫుడ్‌ ‌ప్రైజ్‌ ‌ఫౌండేషన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌టెర్రీ ఈ బ్రాన్‌స్టాడ్‌ ‌మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *