అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం

  • వర్షాలతో జనజీవనం అతలాకుతలం
  • ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు జో బైడెన్‌
  • ‌మొత్తం 19 మంది మరణించినట్లు వెల్లడి

కాలిఫోర్నియా, జనవరి 16 : అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్‌ ‌బీభత్సం సృష్టించింది. దీంతో కాలిఫోర్నియాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎమర్జెన్సీని ప్రకటించారు. కొన్ని వారాలుగా తుఫాన్‌తో, భారీ వర్షాలతో కాలిఫోర్నియా ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కాలిఫోర్నియాలో భారీ విపత్తు చోటు చేసుకున్న దని జో బైడెన్‌ ‌ప్రకటించారు. తుఫాన్‌ ‌కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 19 మంది చనిపోయినట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాలిఫోర్నియాను భారీ చలిగాలులు చుట్టుము డుతున్నాయని, భారీగా కురుస్తున్న వర్షాలతో మట్టి చరియలు విరిగి పడే ముప్పు ఉందని జాతీయ వాతావరణ సర్వీస్‌ ‌తెలిపింది. కాలిఫోర్నియా నుంచి కొలారెడో వరకు పర్వత శ్రేణుల నుంచి భారీగా మంచు కురుస్తుండటంతో ప్రయాణం ప్రమాదకరం అని హెచ్చరించింది. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి.

డ్యాములు పొంగిపొర్లాయి. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శీతకాల వర్షాల ధాటికి కాలిఫోర్నియాలో వరదలతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. చాలాచోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నది. కోస్తా పొడవునా మూడంతస్తుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి. ఈ వరదల వల్ల 34 బిలియన్‌ ‌డాలర్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని సాలినాస్‌ ‌నది వరదతో పరివాహక ప్రాంతాల్లో పొంగి పొర్లుతున్నది. జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్నది. మరో తుఫాన్‌ ‌పొంచి ఉన్న నేపథ్యంలో… 24 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికార ఆదేశాలు జారీ అయ్యాయి.

కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కూడా తుఫాన్‌ ‌ముప్పు ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్‌ ‌లాస్‌ ఏం‌జెల్స్ ‌వైపు వెళుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియా బాధిత ప్రజలకు అవసరమైన ఆర్థిక, హార్థిక సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర శీతాకాల తుఫాన్‌ ‌వల్ల పోటెత్తిన వరదల వల్ల విరిగిపడ్డ మట్టి చరియల్లో, బురదలో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు వైట్‌ ‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాలిఫోర్నియాలో ఎమ్జ్గ•న్సీ ప్రకటించడంతో బాధితులకు తాత్కాలిక వసతి కల్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *