పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్క్ ని ప్రారంభించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అనిరుద్ రెడ్డి, బోయిని బాలమణి బాలరాజ్, కో- ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్, కార్యకర్తలు, కాలనీవాసులు, పాల్గొన్నారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తాం




