షాద్ నగర్ ప్రజా తంత్ర ఆగస్ట్ 09: గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు ప్రతి గ్రామం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ ఎంపిపి ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపిపి శివ శంకర్ గౌడ్ ఆద్వర్యంలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా చేగూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్భంగా సీసీ రోడ్డు శంకు స్థాపన చేశారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో సిసి రోడ్లు అంతర్గత మురుగు కాలువలు, పరిశీలించారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై తమ గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆనంతరం ఎంపిపి ప్రియాంక శివ శంకర్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగాయని అన్నారు. ఎమ్మెల్యేని ఎంపిపి ప్రియాంక శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…



