అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్ర1జాతంత్ర జులై 31 : లింగోజిగూడా డివిజన్ నందు గతంలో మూడు కోట్ల 16 లక్షలు రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది.దానిలో భాగంగా ఈ రోజు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు కలిసి పలు శంకుస్థాపన కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.దానిలో భాగంగా కామేశ్వర కాలనీ నందు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన.మొత్తం 36.00 లక్షలు,శిరిడి సాయి నగర్ నందు  సీ.సీ.రోడ్డు శంకుస్థాపన అంచనా వ్యయం:15.00 లక్షలు,ధర్మపురి కాలనీ నందు సీ.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన అంచనా వ్యయం 45.00 లక్షలు,అధికారి నగర్ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 27.00 లక్షలు,అల్తాఫ్ నగర్ నందు ఓపెన్ డ్రైన్ మరమ్మతులు సుమారు అంచనా వ్యయం 66.00 లక్షలు,మైత్రి నగర్ నందు వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు శంకుస్థాపన అంచనా వ్యయం.సుమారు 23.00 లక్షలు,ఎస్బిహెచ్ థర్డ్ వెంచర్ కాలనీ నందు సీ.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన అంచనా వ్యయం సుమారు 70.00 లక్షలు,ఎల్బీనగర్ ఓల్డ్ విలేజ్ నందు సీ.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన.అంచనా వ్యయం 34.00 లక్షలు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు.దానిలో భాగంగా ముందుగా ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడమే తమ ద్యేయం అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు లక్ష్మీప్రసన్న మరియు డివిజన్ పరిధిలోని సీనియర్ నాయకులు,మాజీ అధ్యక్షులు,పలు విభాగాల కమిటీ సభ్యులు,ఉద్యమకారులు,మహిళలు,పార్టీ అభిమానులు,కార్యకర్తలు,కాలనీ వాసులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *