అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ.

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏ మేరకు ఆయన సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్  డివిజన్ పరిధిలోని మయూరి నగర్, టి ఎన్ నగర్, రెడ్డి  కాలనీలలో రూ.87. 00 ఎనభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయం తో  నూతనంగా చేపట్టబోయే భూగర్భ పైప్ లైన్ నిర్మాణ పనులకు  కార్పొరేటర్లు  ఉప్పలపాటి శ్రీకాంత్ , హమీద్ పటేల్ ,కార్పొరేటర్  మాధవరం రంగరావు   జలమండలి అధికారుల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశమాట్లాడుతూ, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా  కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన  సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మీటర్ మేర చొప్పున భూగర్భ  డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరి అయినవి అని దానిలో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలియచేశారు. అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని పనుల్లో జాపేతా లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని,  కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు జిఎం రాజశేఖర్ డీజీఎం నాగప్రియ, మేనేజర్లుసాయిచరిత ,పూర్ణేశ్వరి, మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,వార్డు మెంబర్లు,ఏరియా,కమిటి మెంబర్లు,బూత్ కమిటి మెంబర్లు,కాలనీ వాసులు,కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *