‘‘‌లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.6.59 లక్షల కోట్లు, ఇతర బాకీలు రూ.17.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక తెలంగాణలో 2018లో అప్పులు రూ.1,60,296.40 కోట్లు కాగా.. 2019లో రూ.1,90,202.70 కోట్లు, 2020లో రూ.2,25,418 కోట్లు, 2021లో రూ.2,67,530 కోట్లు, 2022లో రూ.3,12,191 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్‌డీపీ ప్రకారం తెలంగాణ అప్పులు 2016లో 15.7 శాతం ఉండగా 2022 మార్చి నెలాఖరుకు 27.4 శాతానికి చేరుకున్నాయి.’’

దేశంమే కాదు..రాష్టాల్రు కూడా అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాయి. రాష్టాల్రను కంట్రోల్‌ ‌చేయాల్సిన కేంద్రం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ దేశాన్ని అగాథంలోకి నెడుతుంది. రాష్టాల్రను అజమా యిషీ చేయాల్సిన కేంద్రం చేతులెత్తోస్తోంది. కేంద్రం కూడా అదే దారిలో నడిస్తే మరి ప్రశ్నించే వారు ఎవ్వ రన్నదే ఇప్పుడు ప్రశ్న. ఇలా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నా దేశంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. ధరలు దిగి రావడం లేదు. జిఎస్టీ వాతలు తగ్గడం లేదు. గ్యాస్‌, ‌పెట్రో ధరలు తగ్గలేదు. నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మేస్తున్నారు. అయినా ఈ డబ్బు ఎక్కడికి పోతుందన్నది తెలియాలి. దీనిపై సమగ్ర చర్చ చేయాలి. రాష్టాల్రు చేస్తున్న అప్పులతో పాటు..కేంద్రం చేస్తున్న అప్పులపైనా చర్చించాలి. ఇలా పాలకులు ప్రజలను మభ్యపెడుతూ పోతుంటే నష్టపోయేది ప్రజలే. అందువల్ల దీనిపై పార్లమెంట్‌ ‌ప్రత్యేకంగా చర్చించాలి.

అధికారం అప్పగించాం కదా అని ఇష్టారీతిన అప్పులు చేస్తే కట్టేది ఎవరు. జిఎస్టీ వసూళ్లు లక్షా40 వేల కోట్లకుచేరినా అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోంది. కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ అప్పులు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అంతర్గత, విదేశీ రుణాలు కలిపి 2014-15లో రూ.62.44 లక్షల కోట్లుండగా.. 2021-22లో తాత్కాలిక అంచనాల ప్రకారం రూ.138.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.6.59 లక్షల కోట్లు, ఇతర బాకీలు రూ.17.67 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇక తెలంగాణలో 2018లో అప్పులు రూ.1,60,296.40 కోట్లు కాగా.. 2019లో రూ.1,90,202.70 కోట్లు, 2020లో రూ.2,25,418 కోట్లు, 2021లో రూ.2,67,530 కోట్లు, 2022లో రూ.3,12,191 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్‌డీపీ ప్రకారం తెలంగాణ అప్పులు 2016లో 15.7 శాతం ఉండగా 2022 మార్చి నెలాఖరుకు 27.4 శాతానికి చేరుకున్నాయి. ఎపిలో జగన్‌  ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ రాష్ట్ర అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. 2019లో ఏపీ రుణాలు రూ.2,64,451 కోట్లు కాగా 2020లో రూ.3,07,671.50 కోట్లు, 2021లో రూ.3,60,333.40 కోట్లు, 2022లో రూ.3.98,903.60 కోట్లకు చేరుకున్నాయి. జీఎస్డీపీ ప్రకారం చూసినా 2019లో అప్పుల శాతం 30.4, 2020లో 31.7, 2021లో 36.5, 2022 మార్చి నెలాఖరుకు 37.6 శాతానికి పెరిగాయని కేంద్రమంత్రి చెప్పారు.

నిజానికి ఇంతగా అప్పులు చేసి ఏం చేస్తున్నారన్నదానిపైనా వివరణ రావాల్సి ఉంది. ప్రజలు కూడా పాలకులను అప్పులపై నిలదీయాలి. అలాగే అప్పులపై అజమాయిషీ ఉండాల్సిందే  కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర, రాష్టాల్రు అన్న తేడా లేకుండా అప్పులు పెరుగుతున్నాయి. మరోవైపు ఆర్థికంగా రాష్టాల్రను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేంద్ర పన్నుల్లో రాష్టాల్రకు ఇవ్వాల్సిన వాటాను తగ్గిస్తున్నారు. సామాన్యుల పై అదనపు పన్నులు మోపుతూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. సెస్సుల రూపంలో సింహభాగం నిధులను కేంద్ర ఖజానాకు మళ్లించుకుపోతున్నారు. సెస్సుల పేరుతో మోదీ బాదుడు గత ఎనిమిదేండ్లలో ఏకంగా 4 రెట్లు పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో సెస్సుల మోత 18 శాతానికి ఎకబాకింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమే లోక్‌సభ సాక్షిగా అంగీకరించింది. 2013-14లో వచ్చిన  మొత్తం రూ.10.14 లక్షల కోట్ల రాబడిలో సెస్సు 7.3 శాతంగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.16.33 లక్షల కోట్ల రాబడిలో సెస్సు 18.2 శాతంగా ఉన్నట్టు ప్రస్తుత పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇకపోతే గత ఎనిమిదేండ్లలో మోదీ సర్కార్‌ ‌పెట్రోల్‌, ‌డీజిల్‌పై సెస్సులను అడ్డగోలుగా పెంచి రాష్టాల్రకు తీరని అన్యాయం చేసింది. 2014-21 మధ్య కాలంలో పెట్రోల్‌పై సెస్సును 6 రెట్లు, డీజిల్‌పై ఐదున్నర రెట్లు పెంచింది. తద్వారా రాష్టాల్ర వాటాలను కాజేసి కేంద్ర ఖజానాకు తరలించు కుపోయింది. ఇటీవల కేంద్రం లీటర్‌ ‌పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 చొప్పున పన్ను తగ్గించినప్పటికీ ఆ మేరకు సెస్సును పెంచింది. దీంతో కేంద్రం కొత్తగా నిర్ణయించిన 41శాతం వాటా ప్రకారం రాష్టాల్రకు లీటర్‌ ‌పెట్రోల్‌పై రూ.1.03, డీజిల్‌పై రూ.1.64 చొప్పున ఆదాయం తగ్గింది. ఇదేవిధంగా ఇతర పన్నుల నుంచి రాష్టాల్రకు రావాల్సిన వాటాను కూడా కేంద్రం కొల్లగొడుతున్నది. 2017-2020 మధ్య కాలంలో కేంద్రం ఎక్సైజ్‌ ‌పన్నులో పెట్రోల్‌పై సెస్‌, ‌సర్‌ ‌ఛార్జీలను 150శాతం, డీజిల్‌పై 350శాతం  పెంచింది. సెస్సుల రూపంలో మోదీ సర్కార్‌ ‌రోజూ సగటున రూ.813 కోట్లు దోచుకొంటున్నది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.22,236 కోట్లుగా ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్‌ ‌సెస్సును 2020-21 నాటికి రూ.62 వేల కోట్లకు.. సెకండరీ అండ్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ‌హెల్త్ అం‌డ్‌ ఎడ్యుకేషన్‌ ‌సెస్సును రూ.11,266 కోట్ల నుంచి రూ.35,821 కోట్లకు పెంచింది. ఇదే సమయంలో పెట్రోల్‌పై సెస్సును రూ.4,712 కోట్ల నుంచి రూ.25,895 కోట్లకు.. డీజిల్‌పై సెస్సును రూ.15,765 కోట్ల నుంచి రూ.85,289 కోట్లకు పెంచింది. ఇలా అన్ని సెస్సులు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి అదనంగా రూ.2,96,884 కోట్ల ఆదాయం సమకూరింది.

ఇదంతా రాష్టాల్రకు దక్కకుండా తరలించుకు పోయిన సొమ్మేనని గుర్తించాలి. ప్రజలు చెల్లిస్తున్న అన్ని పన్నులకు అదనంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నునే సెస్‌ అం‌టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదితర రంగాల్లో కేంద్రం ఇలా సెస్‌ ‌వసూలు చేస్తున్నది. సెస్సును ఏ రంగంలో వసూలు చేస్తే ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే వెచ్చించాలి. ఇతర రంగాలకు బదిలీ చేయరాదు. దీనికి భిన్నంగా మోదీ సర్కారు సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నది. పెట్రోల్‌, ‌డీజిల్‌పై విధించిన సెస్‌తో చమురు పరిశ్రమలను అభివృద్ధి చేయడం లేదు. కేంద్రం విధించే సెస్సుల్లో రాష్టాల్రకు వాటా ఉండదు. ఆ సొమ్మంతా కేంద్ర ఖాజానాకే చేరుతుంది. పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే రాబడిలోనే రాష్టాల్రకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో రాష్టాల్రకు నిధులు ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సెస్సులను పెంచుతున్నది. ఇంతగా ఆదాయం సమకూరుతున్నా కేంద్రంలో అప్పులు తగ్గడం లేదు. ఈ నిధులన్నీ ఏమవుతున్నాయో తేలాల్సి ఉంది. అలాగే రాష్టాల్రు కూడా ఉచిత పథకాల పేరుతో చేస్తున్న పందేరాలను కూడా నిలదీయా ల్సిందే. ఇలా ఎంతకాలం సాగిస్తారన్నది కూడా ముఖ్యమే. మొత్తంగా కేంద్ర, రాష్టాల్రు ఉమ్మడిగా దేశ ఖజానాను లూటీ చేస్తున్నాయి. ఈ విధానం ఇలాగే సాగితే ఆర్థిక సంక్షోభం ముదరగలదు. ప్రజలు నిలదీసి, ప్రశ్నించే అలవాటు చేసుకుంటేనే మంచిది.
– ఆర్‌ఎన్‌ఏ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *