అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: అపోహలు వద్దు,నన్ను ఆశీర్వదించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు పేర్కొన్నారు.గురువారం ఆయన ఒక ప్రకటనలో విలేఖరులతో మాట్లాడుతూ…పరిగి నియోజక వర్గ ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని,రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజక వర్గం నుండి తాను తప్పక పోటీ చేయనున్నట్లు తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపించాలని కోరారు.అయితే గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తున్నాయి అని,వాటిని ఎవరు నమ్మరాదని అన్నారు.రానున్న ఎన్నికల్లో తాను తప్పకుండా పరిగి నియోజక వర్గం నుండి బరిలో ఉంటున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *