అన్నారం గ్రామ పంచాయతీ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 13: అన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో నిషేధిత ప్రభుత్వ భూమి లో ప్రైవేటు వ్యక్తులకు ఇంటి నంబర్లు కేటాయించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి జి.ఎం. సుదర్శన్ ను తక్షణమే విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పంచాయతీ లోని ప్రభుత్వ నిషేధిత భూమి  లో(6) మంది ప్రవేట్ వ్యక్తులకు పంచాయతీ కార్యదర్శి ఇంటి నెంబర్లు కేటాయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు.సంబంధిత పంచాయతీ కార్యదర్శి తన స్వంత రక్త సంబందీకులకు, ఒక వార్డు సభ్యుని బంధువులకు ఇంటి నంబర్లు కేటాయించనట్లు గ్రామ ఇంచార్జి సర్పంచ్ ఫిర్యాదు మేరకు గుమ్మడిదల మండల పంచాయతీ అధికారిని   ప్రాథమిక విచారణ చేసి నివేదిక సమర్పించుటకు ఆదేశించడం జరిగిందని తెలిపారు.మండల పంచాయతీ అధికారి సమర్పించిన నివేదిక ద్వారా  పంచాయతీ కార్యదర్శిజిఎం సుదర్శన  అన్నారం గ్రామ పంచాయతీలో గలనిషేధిత జాబితా  భూములలో(6) మందికి ఇంటి నెంబర్లు కేటాయించినట్లు రుజువైనందునపంచాయతీ కార్యదర్శిసుదర్శన్ నుతక్షణమే విధుల నుండి సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ను సమర్పించాలనిడివిజనల్ పంచాయతీ అధికారికి ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *