- ట్యాంక్‌బండ్, పరేడ్ గ్రౌండ్స్‌లో ముమ్మరంగా పనులు
- నేటి సాయంత్రమే ట్యాంక్‌బండ్‌పై ఫుడ్ కోర్టులు
- అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 2వ తేదీన రాష్ట్ర దశాబ్ది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. శుక్రవారం సీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె వ్నిడియాతో మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జూన్2న రాత్రి 11 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. 2వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్ బండ్ పై వెలుగులు విరజిమ్మే క్రాకర్స్, పటాకులు కాల్చుతారని, కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్ మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ అనుదీప్, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు.
ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. జూన్2న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 5వేల మందితో ఎ్న-లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని సీఎస్ కోరారు. శనివారం సాయంత్రం 5 గంట నుంచి ప్రజలను ట్యాంక్ బండ్‌కు అనుమతిస్తారని తెలిపారు. వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫైర్‌వర్కస్, కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వారితో ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు.





