‘అగ్నిపథ్‌’‌పై దేశవ్యాప్త ఆందోళనలు

  • నాలుగేళ్ల తర్వాత 75 శాతం నిరుద్యోగులు
  • పథకాన్ని రద్దు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్‌
  • ‌నేటి నుంచి ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపు
  • ‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే : నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్న కేంద్రమంత్రులు
  • ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశం : ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే

న్యూ దిల్లీ, జూన్‌ 17 : ‌సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ‌పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్ధతిలోనే నియామక పక్రియ చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ పలు రాష్టాల్ల్రో ఆందోళనలు జరుగుతున్నాయి. బిహార్‌, ‌యూపీలలో పలుచోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టారు. భారత్‌ ‌మాతాకీ జై, అగ్నిపథ్‌ ‌వెనక్కి తీసుకోవాలనే నినాదాలు చేస్తూ యువత పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. బిహార్‌, ‌యూపీల్లో..ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు.. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. బిహార్‌లోని లఖీసరాయ్‌ ‌రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు.

ఈ ఘటనలో ఐదు కంపార్ట్‌మెంట్లు కాలిపోయాయి. ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో రైళ్లోని ప్రయాణికులు భయాందోళనలకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వీడియో తీయకుండా ఆందోళనకారులు.. తమ ఫోన్లను లాక్కున్నట్లు స్థానిక పోలీసు సిబ్బంది వెల్లడించారు. యూపీలోని బాలియా రైల్వే స్టేషన్‌లో,బిహార్‌లోని మెహియుద్దీనగర్‌ ‌స్టేషన్‌లో.. జమ్మూ తావీ ఎక్స్‌ప్రెస్‌ ‌రైళ్లోని రెండు బోగీలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బెగూసరాయ్‌, ‌బెట్టియా ప్రాంతాల్లోనూ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కర్రలతో రైల్వేస్టేషన్‌లలోకి ప్రవేశించిన ఆందోళనకారులు..

రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్‌ ‌పథకం ద్వారా..17.5 నుంచి 21 ఏళ్లు మధ్య ఉన్న యువకులు త్రివిధ దళాలలో చేరవచ్చు. ఈ ఏడాదికి మాత్రం గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచారు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మందికి మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని ‘అగ్నివీరులు’గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికులను నియమించనున్నట్లు రక్షణ శాఖ గత మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో సైనిక ఉద్యోగార్థులతో పాటు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

నేటి నుంచి ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపు
సాయుధ దళాల్లో కాంట్రాక్ట్ ‌పద్ధతిలో పోస్టుల భర్తీ కోసం మోడీ సర్కార్‌ ‌తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ‌పథకాన్ని రద్దు చేయాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలని ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపునిచ్చాయి. అగ్నిపథ్‌ ‌పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 18 నుంచి 20 వరకు దేశవ్యాప్త ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూఖ్‌ ‌బిస్వాస్‌ ‌ప్రకటన విడుదల చేశారు. అగ్నిపథ్‌ ‌పథకం ప్రకటించిన తర్వాత ఇప్పటికే 11 మంది ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కేంద్రం ప్రకటించిన కొత్త సైనిక నియామక పథకం ఒక విపత్తని, దేశ సార్వభౌమత్వానికి ప్రమాదమని తెలిపారు. రెండేళ్లుగా సాధారణ సైనిక నియామకాలు జరగడం లేదని, 2021 నాటికి దేశ సైన్యంలో 1,04,653 మంది సిబ్బంది కొరత ఉందని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాంతీయ కోటాలను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుందని, ఆరు నెలల శిక్షణ కాలంతో సహా నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఉద్యోగ కల్పనకు నిర్ణయించిందని విమర్శించారు. నాలుగేళ్ల తర్వాత దాదాపు మూడు వంతుల మంది సైనికులు పెన్షన్‌, ‌గ్రాట్యుటీ లేకుండా పదవీ విరమణ చేస్తారని తెలపడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు ప్రతి ఉద్యోగాన్ని కాంట్రాక్టీకరణ చేస్తున్నాయని, ఇది దేశంలోని శ్రామికుల ఉద్యోగ భద్రత, ఆర్థిక స్థిరత్వాన్ని పూర్తిగా నాశనం చేయడానికి దారితీస్తుందని అన్నారు.

ఈ విధానం ద్వారా ప్రభుత్వం ప్రపంచంలోని సామ్రాజ్యవాద శక్తులచే శిక్షణ పొందిన, నిరుద్యోగ సైనికుల కిరాయి నియామకాలకు కూడా ద్వారాలు తెరిచిందని దుయ్యబట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ ‌సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌కమిటీ దేశ ప్రజలు, దేశ సార్వభౌమాధికారంపై నయా ఉదారవాద దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. అగ్నిపథ్‌ ‌పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, సాయుధ దళాలకు రెగ్యులర్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు.

‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే : నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్న కేంద్రమంత్రులు
‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే అని కేందరమంత్రులు ప్రకటించారు. దీనితో ఎలాంటి ఆందోళనలు అసవరం లేదని కేంద్రమంత్రులు అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ ‌సింగ్‌లు పేర్కొన్నారు. ఆందోళనలపై కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. కోవిడ్‌-19 ‌మహమ్మారి కారణంగా ఆర్మీ నియామక పక్రియ గత రెండేళ్లుగా ఆగిపోయింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోడీ అగ్నిపథ్‌ అనే స్కీమ్‌ని తీసుకువచ్చి అభ్యర్థుల వయసు పరిమితిని రెండేళ్లు పెంచారు. 2022 కి సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివలన చాలా మంది యువతకు లబ్ది కలుగుతుంది. అగ్నిపథ్‌ ‌పథకం ద్వారా యువత దేశానికి సేవ చేయవచ్చు, వారు ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగుతారు.

మోడీకి దన్యవాదాలు అని ట్వీట్‌ ‌చేశారు. దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్న వేళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేందప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ‌పథకం విషయంలో ముందుకే వెళ్తామని స్పష్టం చేశారు. రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు అగ్నిపథ్‌ ‌పథకం ఒక ‘సువర్ణావకాశం’ అని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్‌ ‌పాలసీ కింద ఎంపికైనవారిని ‘అగ్ని వీరులు’గా గుర్తిస్తామని, నాలుగేళ్లపాటు సాయుధ బలగాల్లో వారు పనిచేయవచ్చునని సూచించారు. హింసాత్మక నిరసనలకు పాల్పడవద్దని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ ‌శుక్రవారంనాడు దేశ యువతకు విజ్ఞప్తి చేశారు. రైల్వేల ఆస్తుల ధ్వంసం చేయవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌  ‌పథకానికి నిరసనగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు, హింసాత్మక ఘటనలు, రైళ్లు తగుల పెట్టడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకుండటంతో కేంద్ర మంత్రి ఈ విజ్ఞప్తి చేశారు.

ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశం : ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే
దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న నిరసనల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే సైతం యువత ఆందోళనను చల్చార్చేందుకు కీలక ప్రకటన చేశారు. అగ్నివీరుల నియామకం కోసం వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు కేంద్రం పెంచిదన్నారు. ఇది సువర్ణావకాశమని, నియామకాల పక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. కోవిడ్‌ ‌మహమ్మారి కారణంగా రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్‌ ‌లేక  నిరాశకు గురైన వారికి కూడా వయోపరిమితి పెంపు వల్ల ప్రయోజనం జరుగుతుందన్నారు.

విపక్షాలపై మండిపడిన వీకే సింగ్‌ ఆర్మీలో స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్‌ అం‌టూ అగ్నిపథ్‌ ‌స్కీమ్‌పై విపక్షాలు వివాదం సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాయని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్‌ ‌వీకే సింగ్‌ (‌రిటైర్డ్) ఆరోపించారు. విపక్షాలు చేసేందుకు పనేవి• లేకపోవడంతో కనీసం రిక్రూట్‌మెంట్‌ ‌కూడా ప్రారంభం కాకుండా వివాదం రేపుతున్నాయని అన్నారు. కేంద్ర పథకంలో ఎలాంటి వివాదం లేదని, ప్రతిపక్షాలే వివాదం సృష్టిస్తున్నా యని నాగపూర్‌ ‌విమానాశ్రయంలో హింసాత్మక ఘటనల అనంతరం వీకే సింగ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *