సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు
న్యూ దిల్లీ ,జూన్18: అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అసోం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర •ంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర •ంశాఖ కార్యాలయం ప్రకటించింది. ఫలితంగా తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించ నున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా కారణంగా రెండేళ్లు రిక్రూట్?మెంట్? జరగలేదని.. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ’అగ్నిపథ్’పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్టాల్రకు విస్తరించాయి. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తోపాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్టాల్ల్రో విధ్వంసానికి పాల్ప డ్డారు. రైళ్లకు నిప్పంటిం చారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. 234 రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన ’అగ్నిపథ్’ సర్వీస్ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45 వేల మందిని నియమిం చనున్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టను న్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికైన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్ద నున్నారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనున్నారు.
అగ్నివీరులకు రక్షణశాఖలో ఉద్యోగాలు
పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తాం: రాజ్‌నాథ్
న్యూ దిల్లీ ,జూన్18: నాలుగేళ్ల స్వల్ప కాలం కోసం యువతను త్రివిధ దళాల్లోకి భర్తీ చేసుకునేందుకు ఉద్దేశించిన ’అగ్నిపథ్’ స్కీమ్ పై దుమారం రేగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్?నాథ్ సింగ్ స్పందించారు. ’అగ్నిపథ్’ స్కీమ్ ద్వారా నియమితులయ్యే వారిని అగ్నివీర్లు అని పిలుస్తారు. అర్హులైన అగ్నివీర్లకు రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈ రిజర్వేషన్లు ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, 16 రక్షణ రంగ సంస్థల్లో అమలవుతాయని వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నియామక పక్రియకు సంబంధించిన నిబంధనలను సవరించి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. వయోపరిమితికి సంబంధించి సముచితమైన సడలింపులు కూడా కల్పిస్తామని రాజ్?నాథ్ సింగ్ చెప్పారు. అగ్నిపథ్ పై త్రివిధ దళాల ఉన్నతాధికారు లతో శనివారం ఉదయం సక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈమేరకు రాజ్ నాథ్ ప్రకటన చేశారు. కాగా, అగ్నిపథ్ ఆందోళనలను చల్లార్చేందుకే కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని పరిశీలకులు అంటున్నారు. ఇక పారా మిలటరీ బలగాలలోనూ 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు కేంద్ర •ంశాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.




