న్యూ దిల్లీ, జూన్ 20 : ‘అగ్నిపథ్’ స్కీమ్ లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన సైన్యం రిజిస్టేష్రన్ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్టేష్రన్ పక్రియ మొదలతుందని వెల్లడించింది. భారత సైన్యంలోకి ప్రవేశించాలనుకునే వారికి అగ్నిపథ్ స్కీమ్ ఒక్కటే మార్గమని నోటిఫికేషన్ లో ప్రస్తావించారు. కేవలం సైన్యంలోని మెడికల్ బ్రాంచ్ కు చెందిన టెక్నికల్ క్యాడర్ భర్తీ పక్రియ కోసం మాత్రమే ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడుతాయని స్పష్టం చేశారు.
కాగా, భారత నౌకాదళంలో అగ్ని వీర్ల భర్తీకి జూన్ 21న, వాయుసేనలో భర్తీకి జూన్ 24న నోటిఫికేషన్లు వెలువడుతాయని ట్విటర్ హ్యాండిల్ లో ఆర్మీ ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవాలని భావించే వారు తప్పకుండా త్రివిధ దళాల వెబ్ సైట్ లలోరిజిస్టేష్రన్ చేసుకోవడం తప్పనిసరి అని నిర్దేశించింది.

