అందరికంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పది

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఈ ప్రపంచంలో అందరికంటే ఉపాధ్యాయ వృత్తి గొప్పదని బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి అన్నారు. మాస్టర్ మైండ్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు-2023లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విశ్రాంత ప్రిన్సిపాల్, ప్రముఖ విద్యావేత్త జి.వేణు గోపాల్ రెడ్డి లతో కలసి ప్రసంగించారు. బండ్లగూడ కార్పొరేటర్ పి.సుదర్శన్‌రెడ్డి పాల్గొని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను శాలువా, సర్టిఫికెట్, మొమెంటోలతో సత్కరించారు. నిర్వాహకులు డాక్టర్ పాండు రమావత్, డాక్టర్ జగన్ మోహన్ రావు, ప్రిన్సిపాల్, నవనీత విద్యార్థులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. బెస్ట్ టీచర్ అవార్డ్-2023 అందుకున్న శారద విద్యాలయ అధ్యాపకురాలు జక్కుల విఘ్నాత(ఎంటెక్, ఎంఎస్సీ, బిఈడి)ను తెలంగాణ మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ రాజ్ నారాయణ్ ముదిరాజ్, శ్యామ్ రావు శాలువా బొకేతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *