అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ప్లాప్ అయింది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: సిద్దిపేట పట్టణంలో వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పట్టణంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ నుండి మురికి నీరు అంతా బయటికి వస్తుందని అన్నారు. చిన్నపాటి వర్షానికి మ్యాన్ హోల్ మత్తడి దుంకుతున్నాయని ఎద్దేవా చేశారు. పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రజలు మ్యాన్ హోల్ నుండి వస్తున్న మురికినీరు వల్ల ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అటువైపు మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల గారు కమిషనర్ సంపత్ కుమార్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని అన్నారు. రెవెన్యూ కార్యాలయం వద్దనే కాకుండా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. దీనివల్ల వార్డులోని కాలనీ ప్రజలకు వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. మ్యాన్ హోల్ నుండి మురికి నీరు వస్తున్న వాటిని వెంటనే క్లియర్ చేయాలని అన్నారు. నాసిరకం వలె నిర్మాణం జరిగిందని అందుకే మాన్ హోల్ నుండి నీరు బయటికి వస్తుందని అన్నారు. పట్టణమంతా సందర్శించి మురికి నీళ్లు ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ వేయాలని దోమలు రాకుండా ఫాగింగ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్యాదర్ మదు, గాయాసుద్దిన్, ఫాయాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *