అండగా ఉంటాం.. అధైర్య పడొద్దు : టి.డి.పి జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు

పరిగి, ప్రజాతంత్ర, జూలై 28: పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని తిమ్మాయ పల్లి గ్రామానికి చెందిన చీమ రాములు ఆరోగ్య పరిస్థితులు బాగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతుండటంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, పరిగి నియోజక వర్గ ఇంఛార్జి కాసాని వీరేష్ బాబు ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు.కాసాని వీరేష్ యువసేన సభ్యుల ద్వారా 5వేల రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు.ఆర్థిక సహాయం అందించిన కాసాని వీరేష్ బాబు కు బాధిత కుటుంభం కృతజ్ఞతలు తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సమయంలో ఇలా ఆర్థికంగా ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అంజిలయ్య,చీమ రమేష్,అనంతయ్య,పద్మయ్య, రాఘవేందర్,శ్రీశైలం కాసాని వీరేష్ యువసేన సభ్యులు సాయి రామ్,హన్మంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *