YSRTP షాద్నగర్ నియోజకవర్గ ఎమెల్యే అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న శీలం శ్రీను

 ప్రజా తంత్ర అక్టోబర్ 17:   షాద్ నగర్  నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమెల్యే అభ్యర్థిత్వానికి లోటస్ పాండ్ పార్టీ కార్యాయంలో పార్టీ ముఖ్యనేతలు పిట్టా రాంరెడ్డి, ముస్తఫా, లింగారెడ్డి ధరఖాస్తు అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శీలం శ్రీను. ఈ సందర్బంగా శీలం శ్రీను మాట్లాడుతూ దాదాపు 12 సవత్సరాల నుండి వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ, ప్రజల సమస్యలపై వారి పక్షాన ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాను అని అన్నారు. షర్మిలక్క పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై పోరాడాలని ఎలాంటి పిలుపునిచ్చిన, ఏ కార్యక్రమం ఇచ్చిన ముందుండి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు. కావున షర్మిలమ్మ నా దరఖాస్తుని పరిగణలోకి తీసుకొని టికెట్ ఇస్తే షాద్నగర్ నియోజకవర్గంలో షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ప్రతి గడపకు తీసుకెళ్లి మంచి మెజారిటీ ఓట్లు సాధించి గెలుపు దిశగా పయనిస్తా అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు నరేష్, ఆవ శివ, మహేష్, ప్రవీణ్, సంతోష్ మరియు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *