శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యూట్యూబర్ అయిన నిఖిల్ రెడ్డిని ప్రేమిస్తోంది. కొంతకాలంగా నిఖిల్ రెడ్డి ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుండటంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆరు నెలల క్రితం కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు నచ్చజెప్పి కాపాడారు. అయితే ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కోమలి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిఖిల్ రెడ్డి వేధింపుల వల్లే తన కూతురు చనిపోయిందన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిఖిల్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోమలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని చాటింగ్, కాల్ డేటాను సేకరిస్తున్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

