రాహుల్ ప్రసంగం అడ్డుకోవడంపై  యూత్ కాంగ్రెస్ ఆగ్రహం  

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సూర్యాపేట జిల్లా యువజన నాయకులు ఎస్.సుధీర్ రెడ్డి భారీ ర్యాలీ గా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శివ చరణ్ రెడ్డి మాట్లాడుతూ  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాల చీకటి ఒప్పందాలు దేశ ప్రజలకు రాహుల్ గాంధీ తెలియజేసే ప్రయత్నాన్ని కుట్ర పూరితంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అమెరికా, చైనా దేశాలతో జరిగిన ఒప్పందాలను బయటకు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్న రాహుల్ గాంధీని  మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని జక్కిడి శివ చరణ్ రెడ్డి అన్నారు. నిరసన కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర  కో ఇంచార్జులు రోష్ని జైస్వాల్, భవ్యా, లీగల్ సెల్ చైర్మన్ నిఖిల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం శ్యాం చరణ్ రెడ్డి, శక్తి సూపర్ షీ విద్యా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *