– వోట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి
– వోట్లు తగ్గినా సీట్లు బిజెపికి పెరిగాయి
– గాంధీభవన్ ముందు యూత్ కాంగ్రెస్ నిరసన
– పిసిపి చీఫ్ మహేష్ కుమార్, మంత్రి పొన్నం విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 17: బీహార్‌లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.. వోట్ చోరీ నీ నిరసిస్తూ గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలన్నారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధముగా ఉందని కొనియాడారు. వోట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. వోటు విలువ తెలియక ఉండటం శోచనీయమన్నారు. బీహార్ ఎన్నికల్లో సామాన్యులకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. వోటు శాతం తక్కువగా వొచ్చి ఎన్డీయే సీట్లు గెలవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీహార్‌లో వోట్ చోరీతో ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీహార్ లో ఎన్డీయే కూటమికి సీట్లు గెలుచుకుందన్నారు. దేశ భవిష్యత్ కి విఘాతం కలిగించే విధంగా వోట్ చోరీ ఉందన్నారు. వోట్ శాతం మహాఘాట్ బంధన్ కి ఎక్కువ వొస్తే.. ఎన్డీయే కూటమికి సీట్లు పెరిగాయని మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు.సెక్యులర్ వోట్లను తొలగించారు.. వోట్ చోరీ తో రాజ్యాంగానికి తూట్లు.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరు తెన్నులు శోచనీయం.. అధికార బిజెపికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని చేస్తుంది. దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది.. అధికారం పరమావధిగా మోదీ అమిత్ షా వోట్ చోరీకి పాల్పడుతున్నారు.. బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికం.. వోట్ చోరీ గురించి 8 ఏళ్ల క్రితమే పోరాడాం.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది.. రేపటి నుంచి తెలంగాణలో వోట్ చోరీ సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుంది.. తెలంగాణలో సర్ పేరిట వోట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉందని టీపీసీసీ ఛీప్ వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా వోట్లు తొలగించి చోరీకి పాల్పడుతోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా వోటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు. వోటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శక్తివంతంగా పనిచేయాలని దిశానిర్దేశర చేశారు. దేశవ్యాప్తంగా టుచోరీపై నిరసనలు ఉద్దృతం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే, సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు యూత్ కాంగ్రెస్ నివాళులులు అర్పించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





