యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్

– ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలు
– యూత్ కాంగ్రెస్ చిల్లర చేష్టలపై విమర్శలు

న్యూదిల్లీ, ఫిబ్రవరి24: దిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన
‘షర్ట్ లెస్’ నిరసనకు సంబంధించి.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబు దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసన  సమ్మిట్ ఎగ్జిబిషన్ హాల్లో గురువారం జరిగిన సంగతి తెలిసిందే. ఐదుగురు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు విప్పేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సందేశాలు రాసిన టీ- షర్టులు పట్టుకొని నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు గుప్పించారు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వెంటనే బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన తర్వాత ఏడుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు ఉదయ్ భానును మంగళవారం అరెస్టు చేశారు. ఆయన్ను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్లో 15 గంటలకు పైగా విచారించిన తర్వాత అరెస్ట్ చేశారని సమాచారం. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్ట్ ల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆయనపై. కుట్రలో పాత్ర ఉందని, విచారణకు సహకరించలేదని, తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు ఆరోపించారు. త్వరలో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. భూపేశ్ బాఘేల్ వంటి సీనియర్ నేతలు ఈ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. ‘ప్రజాస్వామ్యంలో యువత ప్రశ్నలు వేయడం, నిరసన తెలపడం నేరం కాదు, అది ప్రజాస్వామ్య ఆయుధం’ అని బాఘేల్ అన్నారు. ఈ అరెస్ట్ లను అరాచక, అన్యాయ చర్యలుగా పేర్కొన్నారు. నిరసన శాంతియుతంగా జరిగిందని, యువత బాధలను బయటపెట్టడమే ఉద్దేశ్యమని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఈ నిరసనను ‘నేకెడ్ యాంటీ-ఇండియా ప్రొటెస్ట్’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ను యాంటీ- ఇండియా, యాంటీ-గ్రోత్ పార్టీగా విమర్శించారు. ‘యువతకు కాంగ్రెస్ ‘సంగి’ పార్టీగా కనిపిస్తోంది’ అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *