– కేంద్రం చర్యను తప్పుపట్టిన ఎంపీ ప్రియాంక గాంధీ
న్యూదిల్లీ, ఫిబ్రవరి 25: ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ యువ నేతలు భారత్- అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. సమ్మిట్‌లో నిరసన చేసిన కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు సిగ్గుచేటని ఆమె ధ్వజమెతారు. ’సత్యం కోసం, శాంతియుత, అహింసాయుత ప్రతిఘటన మనం గర్వించదగిన వారసత్వం. ఇది మహాత్మాగాంధీ, లక్షలాదిమంది భారతీయుల పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చింది. ప్రపంచ ఒత్తిడికి తలొగ్గి భారతదేశ ప్రయోజనాలతో రాజీపడిన ప్రధానికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచడం 1.4 బిలియన్ల భారతీయుల ప్రయోజనాలకు మంచిది. ప్రజల గొంతును పెంచినందుకు యూత్ కాంగ్రెస్ సభ్యులపై తీసుకున్న చర్య తీవ్రంగా ఖండించదగినది.. సిగ్గుచేటైన విషయం.. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నిర్భయ సైనికులకు దృఢంగా అండగా నిలుస్తుంది అని ఆమె బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పేర్కొన్నారు. చేశారు. అని ప్రియాంక ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కాగా, ఏఐ సదస్సులో షర్ట్ విప్పి నిరసన తెలిపిన ఘటనకు కీలక సూత్రధారిగా భావించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయభాను చిబ్‌ను మంగళవారం అరెస్టు చేశారు. భానుతోపాటు మరో ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తల్ని అరెస్టు చేసి వారిపై అల్లర్లకు పాల్పడినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




