– అన్‌క్లెయిమ్డ్ మనీ సొంతం చేసుకోండి
– ప్రధాని మోదీ మరోమారు పిలుపు
న్యూదిల్లీ, డిసెంబర్ 10: అన్ క్లెయిమ్డ్ ఆస్తుల విషయంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీ చేయడంతో ప్రజల్లో కొంత చైతన్యం వచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా తనవంతుగా ప్రచారం మొదలు పెట్టారు. క్లెయిమ్ చేయని ఆస్తుల గురించి మోదీ బుధవారం లింక్డిన్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన, క్లెయిమ్ చేయని నగదును దక్కించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు అందుకోసం విూ డబ్బు.. విూ హక్కు మూమెంట్‌లో పాల్గొనాలని సూచించారు. భారతీయ బ్యాంకుల్లో రూ.78 వేల కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో రూ.14 వేల కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో రూ.3వేల కోట్లు, డివిడెండ్లు రూ.9వేల కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్‌సైట్లను ఆయన ప్రజలతో పంచుకున్నారు. ఇప్పటికే రూ.2వేల కోట్ల విలువైన ఆర్థిక ఆస్తులను ఈ ఏడాది అక్టోబరు, నవంబరుల్లో హక్కుదార్లకు అందించామని చెప్పారు. అనేక కారణాల వల్ల క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న బ్యాంకు డిపాజిట్లు, బీమా, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, పింఛన్ వంటి ఆర్థిక ఆస్తులను సంబంధిత హక్కుదారులకు, చట్టబద్ధ వారసులకు అందించాలన్న లక్ష్యంతో యువర్ మనీ – యువర్ రైట్ కార్యక్రమాన్ని అక్టోబరు 4న దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, జిల్లా పాలనాధికారులు, ఆర్థిక సేవల అధికారులతో అక్టోబరు నుంచి డిసెంబరు 5 వరకు 477 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ వెల్లడిరచారు. ఆర్థిక సంస్థల్లో ఉండిపోయిన తమ ఆర్థిక ఆస్తులను పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను తెలిపి సందేహాలను పరిష్కరించడంతోపాటు పలు అంశాలపై అవగాహన కల్పించే విషయాలను ప్రధాన ప్రాంతీయ భాషల్లోనే అందించామని వెల్లడిరచారు. వీడియో సందేశాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించామన్నారు. ప్రజలు తమ అన్‌క్లెయిమ్డ్ ఆర్థిక ఆస్తులను కనుగొనడంలో ఆర్‌బీఐ ’ఉద్గమ్’, ఐఆర్‌డీఏఐ ’బీమా భరోసా’, సెబీ ’మిత్రా’ సమర్థంగా ఉపయోగపడుతున్నాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





