– తను కోరుకున్న యువతికి మరొకరితో పెళ్లి
– కోపంతో యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి ఒడిగట్టాడు. కాకినాడకు చెందిన 25 ఏళ్ల యువతి కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మియాపూర్‌లోని రెడ్డి కాలనీలో నివసిస్తోంది. స్థానికంగా హౌస్ కీపింగ్ పనిచేస్తూ జీవిస్తోంది. కొంతకాలం క్రితం ఆమెకు ప్రసాద్ అనే వ్యక్తితో పరిచయం అయింది. ఇద్దరూ ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి ఆలీషా అలియాస్ పాండు అనే యువకుడికి నచ్చలేదు. ఆమె పనిచేస్తున్నచోట పాండు వంటవాడిగా పనిచేస్తున్నాడు. అతడు ఆమెని ఇష్టపడ్డాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. ఇంతలోనే ప్రసాద్‌ను పెళ్లి చేసుకోవడంతో పాండు తట్టుకోలేకపోయాడు. ఈ నెల 19న తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌లతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి తనతో రమ్మని అడిగాడు. ఇందుకు యువతి ఒప్పుకోలేదు. ఆమె తన మాట వినకపోవటంతో పాండు ఆగ్రహానికి గురయ్యాడు. వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు. పాండుతోపాటు అతడి తండ్రి లాలూను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



