యువతి ఆత్మహత్య

– నిశ్చితార్థం అయిన వ్య‌క్తి హెచ్ఐవి రక్తం ఎక్కించడంతో..

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : హెచ్ఐవీ రక్తం ఎక్కించిన సంఘటనలో బాధితురాలు శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పలోని తమ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ యువతి రమణి(23) ఎదులాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. సమీప బంధువైన మనోహర్‌తో కుటుంబీకులు ఆమెకు నిశ్చితార్థం జరిపారు. పెళ్లికి అంతా సిద్ధమైన తర్వాత వైద్య పరీక్షల్లో అతనికి ఎయిడ్స్ ఉందని తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు మనోహర్‌తో పెళ్లికి నిరాకరించారు. ఇది మనసులో పెట్టుకున్న నిందితుడు తనను వివాహం చేసుకోవాలని రమణిని పలుమార్లు బలవంతం చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో మార్చి 11న యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి బలవంతంగా హెచఐవీ రక్తాన్ని ఎక్కించి అక్కడ్నుంచి పారిపోయాడు. బాధిత యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. రమణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మనోహర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఉదంతం మొత్తాన్ని అవమానకరంగా భావించిన యువతి శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *