పైలట్‌ ‌శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం

– ఇన్‌‌స్ట్రక్టర్‌ ‌అఘాయిత్యం
– ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌8: ‌బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ ‌పైలట్‌ ‌శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై  ఇన్‌‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్‌ ‌అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్‌ ‌కు దమ్మాయిగూడకు చెందిన మరొక  ఇన్‌‌స్ట్రక్టర్‌సల్మాన్‌ ‌సహకరించాడు. యువతిపై అత్యాచారం జరిపి వీడియోలు, ఫోటోలు తీసుకుని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు నసీముద్దీన్‌. ‌ట్రైనింగ్‌ ‌కోసం వచ్చిన యువతిని మాయమాటలతో లొంగదీసుకున్న ట్రైనర్‌ ‌నసిముద్దీన్‌. ‌పలుమార్లు వేధింపులకు పాల్పడడంతో యువతి ట్రైనింగ్‌ ఆపేసింది. 2025లో అత్యాచారం జరిగిన ప్రాంతం బేగంపేట పరిధిలో ఉండడంతో బేగంపేట పోలిస్‌లకు ఫిర్యాదు చేసింది. 2025 జనవరి నుండి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నది. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన బేగంపేట పోలీసులు నసీముద్దీన్‌ ‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *