– బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పిటిషన్ దాఖలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. కాంగ్రెస్ నేతలు కేశవరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్, చిన్నారెడ్డిలతోపాటు మరో తొమ్మిదిమందికి కేబినెట్ హోదా చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ప్రస్తావించారు. రిజిస్ట్రీ అభ్యంతరం చెప్పడంతో చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మాత్రమే కేబినెట్ హోదా ఇవ్వాలని వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా ఉంటుందని ఎర్రోళ్ల వివరించారు. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చి నెంబర్ కేటాయించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2017లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిల్ దాఖలు చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వేసిన పిల్‌తోపాటు బీఆర్‌ఎస్ పిటిషన్లను కలిపి వచ్చే వారంలో విచారణకు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి హైకోర్టు.ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.